A korean girl cried after eating Indian candy pulse
మీరెప్పుడైనా మన దేశంలో దొరికే సాధారణ చాక్లెట్ తిని ఏడ్చేశారా ? అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరి విన్నది నిజమే. దక్షిణ కొరియాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హ్యోజియోంగ్ పార్క్ అనే యువతి ఇండియన్ క్యాండీ చాక్లెట్ తింటూ ఏడుస్తూ బిగ్గరగా అరుపులు చేసింది. అంతేకాదు ఆ చాక్లెట్ టేస్ట్ ఎలా ఉందో చెబుతూ వీడియో కూడా రికార్డ్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో ఇటీవల పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాగుందని పలువురు కామెంట్లు చేయగా, మరికొంత మంది చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.
ఇండియాలో టాంగీ పల్స్ క్యాండీలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఈ క్యాండీలు ఆమ్ల రుచులతోపాటు కొంచెం కారంగా ఉంటాయి. వీటిని సాధారణంగా ఎక్కువగా సరదా సమయంలో తినేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ టాంగీ క్యాండీ రకాలలో పల్స్ చాక్లెట్స్ అగ్రస్థానంలో ఉన్నాయని తెలుస్తోంది.