వంటల్లో వెరైటీలు చేయడమే కదా అసలు ట్రెండ్. ఒకప్పుడు వంటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ఇప్పుడు ఫుడ్ రంగం అనేది చాలా పెద్దది. రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్‌కు వెళ్తే ఖచ్చితంగా చాలా రకాల వంటకాలు అక్కడ ఉంటాయి. ఏది తినాలో కూడా అర్థం కాదు. కొన్నింటిని ఇప్పటి వరకు రుచి కూడా చూసి ఉండం. చెఫ్‌లకు నచ్చితే ఎలాంటి ఫుడ్ అయినా చేస్తారు. కస్టమర్స్ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే ఇక ఆ ఫుడ్‌ను మెనూలో చేర్చుతారు.
తాజాగా ఓ మహిళ చీజ్ బిర్యానీ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోయారు. బిర్యానీకి ఎంత పేరు ఉంది. కానీ.. ఆ పేరును మొత్తం చెడగొట్టేశావు. అసలు చీజ్‌తో బిర్యానీ చేయడం ఏంటి.. మా ఖర్మ కాకపోతే.. ఛీ.. యాక్ ఇలాంటి బిర్యానీ తింటే జీవితంలో బిర్యానీ మీదనే అసహ్యం వేస్తుంది. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ధమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీలను తిని.. చీజ్ బిర్యానీ తింటే ఇక మా పని గోవిందా అంటూ నెటిజన్లు ఆ మహిళ పోస్టుపై ట్రోల్స్ చేస్తున్నారు.
ఆ మహిళ ఆ బిర్యానీలో పన్నీరు వేసింది ఓకే.. పాలకూర గ్రేవీని వేసింది ఓకే, టమాటా గ్రేవీ వేసింది ఓకే కానీ.. పైన చీజ్ వేయడంతో ఆ బిర్యానీకి ఉన్న టేస్ట్ మొత్తం పోయింది. అసలు చీజ్‌ను ఎక్కడ వాడాలో కూడా తెలియదా అంటూ నెటిజన్లు ఆ మహిళపై ఫైర్ అవుతున్నారు. పాజిటివో.. నెగెటివో.. ఆ చీజ్ బిర్యానీ చేసినందుకు ఆ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చీజ్ బిర్యానీపై నెటిజన్ల రెస్పాన్స్ మీరే చూడండి.