SRPT: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. సిరిపురంలో ప్రజలకు సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని ఎస్సై సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలన్నారు.