NLG: దేవరకొండ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలునాయక్ మంగళవారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి ఆపద కాలంలో కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఆలంపల్లి నరసింహ, మాజీ ఎంపీపీ జాన్, హరికృష్ణ, సురేశ్ గౌడ్ పాల్గొన్నారు.