WGL: వరంగల్లోని రైల్వే ఆసుపత్రులను వరంగల్ ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.