KMM: గార్ల మండలం పుట్టకోట శ్రీ సీతారామ ఆలయంలో సోమవారం సాయంత్రం 7:11 నిమిషాలకు దామోదర హారతి, కార్తిక దామోదర దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సభ్యులు రామభద్రయ్య ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.