ADB: బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన జల్కే పాండురంగ్ ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ బాధితుని సోమవారం పరామర్శించారు. విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.