HYD: ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 221, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.