KMM: మధిర మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ కుమార్ బుధవారము ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధిరలో ప్రధాన సమస్యగా ఉన్న పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా ప్రజలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే మున్సిపాలిటీ సిబ్బందికి తెలియజేయాలని కోరారు.