SRPT: తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. విద్యుత్ హై టెన్షన్ వైర్లు చేతికి అందే విధంగా కిందకి వేలాడుతున్నాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.