NZB: జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిపుత్రుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన యోధుడు నిజం పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన సాయుధ యోధుడు కొమరం భీం జయంతి వేడుకల్ని మంగళవారం హాసకొత్తూర్లో ఆదివాసీ నాయక్ పోడ్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సంఘం అధ్యక్షుడు పాల్గొని కొమరంభీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.