NZB: ఎడపల్లి మండలం జానకంపేటలో ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సొసైటీ ఛైర్మన్ నరేందర్ తాహసీల్దార్ ధన్వాల్కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ నరేందర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి నష్టపోతున్నారన్నారు. కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.