KMR: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం మంగళవరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరప్రసాద్ హాజరై మాట్లాడారు.