NLG: చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ గ్రామాల ప్రజలు వృద్ధులు వికలాంగులు ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ మెగా క్యాంపు కార్యక్రమాన్ని నిర్వహించాలని హాస్పిటల్ ఛైర్మన్‌ను కోరారు.