BDK: కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. గుండాలలో అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.