KMR: ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వెంకటేశ్ తెలిపారు. . లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు ఇరువర్గాల సమ్మతితో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.