BDK: ఇల్లు కాలిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు పిల్లి రవివర్మ అన్నారు. గురువారం బూర్గంపాడు మండలం బత్తుల నగర్ గ్రామానికి చెందిన సోడే వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి 4 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.