NLG: కోదాడ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు కూచిపూడి గ్రామ వరద బాధితులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధితులు మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదంటూ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు.