TG: ప్రజాస్వామ్యంలో ఎవరైనా సుప్రీం కోర్టు తీర్పును వినాల్సిందేనని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వక్ఫ్ బోర్డును రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. సుప్రీం కోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలిచ్చారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అవుతోందన్నారు. ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయని విమర్శించారు.