TG: లగచర్ల దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని రాష్ట్ర గిరిజన డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులను వాడుకుంటున్నారని చెప్పారు. గిరిజన జాతిని సమస్యల్లోకి నెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గిరిజన జాతికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.