SKLM: ఎచ్చెర్ల మండలం పొన్నాడ, కుప్పిలి గ్రామాలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రేపు శనివారం ఆధార్ కేంద్రం నిర్వహణ జరుగుతుందని ముద్దాడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎం శంకర్ ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఆధార్ వివరాలలో తప్పుల సవరణ, అప్డేషన్ కొరకు విద్యార్థుల అపార్ ఐడి నమోదుకు, సమీప గ్రామ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.