SKLM: శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం ఏపీ సచివాలయం వద్ద రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీను మర్యాదపూర్వకంగా కలిశారు. గార మండలం మొగతలపాడు గ్రామంలో భూములు గతంలో అటవీ భూములుగా రికార్డుల్లో ఉందని వాటిని డీ నోటిఫై చేసి గ్రామస్తులు అమ్మకాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రం ఇచ్చారు.