SRCL : దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, శుక్రవారం రాత్రి జ్వాల తోరణం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జ్వాల తోరణం కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు.