HYD: సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పారు. నేతన్నలు ఆత్మహత్యలు మానుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించిందని, సిరిసిల్లకు యారన్ డిపోను కూడా మంజూరు చేసిందని చెప్పారు.