AP: CM చంద్రబాబుకు అధిష్ఠానం ఢిల్లీలో ఉందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు మార్కెటింగ్ స్కిల్స్ పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం APకి రూ.17 వేల కోట్లు రావాలని.. కానీ చంద్రబాబు రూ.3,900 కోట్లు మాత్రమే తెచ్చారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.10,500 కోట్లు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు చెప్పే సంపదసృష్టి బ్రహ్మపదార్థం అని చెప్పారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి కారణమేంటని ప్రశ్నించారు.