AP: రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అన్ని బస్సుల్లో టికెట్ ధరలో 25 శాతం రాయితీ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాయితీ అమలుపై APSRTC సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధుల వయసు నిర్ధారణకు 6 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపాలని పేర్కొంది. వృద్ధులు ఆధార్, సీనియర్ సిటిజన్, పాన్ కార్డు, ఓటరు, పాస్పోర్టు, రేషన్ కార్డు చూపవచ్చని ఆర్టీసీ ఆదేశాల్లో సూచించింది.