కృష్ణా: ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి శుక్రవారం విజయవాడ బస్ స్టాండ్ లోని బ్లాక్ 3లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఛైర్మన్ మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్లను రెండేళ్ల కాలంలో యాభై లక్షలకు పెంచుతామన్నారు. ఛైర్మన్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.