MBNR: ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉద్యాన శాఖ అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వంటనూనెలను ఇతర దేశాల నుంచి రూ. కోట్లు ఖర్చు చేసి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. లాభదాయకమైన ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.