NZB: మాక్లూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా మంజూరైన బీ. ఎస్సీ. నర్సింగ్ మహిళా కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.