Where is Venkat Reddy:సరూర్ నగర్లో యువ సంఘర్షణ సభ జరిగింది. రేవంత్ (revanth) ప్రసంగించారు. ప్రియాంక (priyanka) మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అంటూ హామీలు ఇచ్చారు. వేదికపై ముఖ్య నేతలు ఆశీనులై కనిపించారు. కానీ ముఖ్య నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy Venkat Reddy) మాత్రం కనిపించలేదు. ఈ విషయం చర్చకు దారితీసింది. దీంతో ఆయన స్పందించారు. వ్యక్తిగత కారణాలతో సభకు హాజరుకాలేదని వివరించారు. విషయాన్ని ప్రియాంక గాంధీకి (priyanka gandhi) ముందే చెప్పానని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy Venkat Reddy) విదేశాల్లో ఉన్నారని తెలిసింది. సభకు రాలేరని.. ఆయన ప్రతినిధులు ప్రియాంక గాంధీకి సమాచారం ఇచ్చారట. కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Venkat Reddy) అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అతని సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మునుగోడు అసెంబ్లీకి రాజీనామా చేసి.. బీజేపీ నుంచి పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. వెంకట్ రెడ్డి ( Venkat Reddy) కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది.
ఇటీవల నల్గొండ జిల్లాలో వెంకట్ రెడ్డి ( Venkat Reddy) పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ (nalgonda) నుంచి పోటీ చేస్తానని తెలిపారు. విజయం సాధిస్తానని తేల్చిచెప్పారు. నల్గొండతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ (congress party) సమావేశాలకు- ముఖ్యమైన మీటింగ్లకు రావడం లేదు. దీంతో ఆయన పార్టీలో ఉన్నారా..? లేదా అనే సందేహాం కలిగింది.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని అంతకుముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) అన్నారు. అంతా కలిసి పనిచేస్తాం అని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ (nalgonda) నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఇప్పుడు అక్కడినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam) ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ పార్టీ 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తోందని గతంలో ఉత్తమ్ (uttam) ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది.