»Ts Intermediate Hall Tickets 2024 Released Download
TS Inter Hall Tickets : టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ ఇంటర్ హాల్ టిక్కెట్లు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఇప్పటి వరకు కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
TS Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ హాల్ టిక్కెట్లు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. ఇప్పటి వరకు కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇటీవల విద్యార్థులు నేరుగా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
TS ఇంటర్ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?
దశ 1 : TSBIE అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.inని సందర్శించండి.
దశ 2 : హోమ్‌పేజీలో TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టిక్కెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
దశ 3 : లాగిన్ పేజీలో TS ఇంటర్ మొదటి సంవత్సరం లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టిక్కెట్ కోసం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
దశ 4 : హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు
తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. ప్రథమ, ద్వితీయ పరీక్షలు ఒకే షిప్టులో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.