TS Mega DSC 2024 Applications : సోమవారం నుంచి ఆన్లైన్లో డీఎస్సీ దరఖాస్తులను (Applications ) స్వీకరించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. గతవారం మెగా డీస్సీ నోటిఫికేషన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
2023లో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ని రద్దు చేసి తాజాగా 2024 మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగార్థులు, అర్హులు తమ దరఖాస్తులను https://tsdsc.aptonline.in/tsdsc/ ద్వారా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకునే సౌలభ్యాన్ని కలిగించింది. ముందుగా పోస్టును సెలెక్ట్ చేసుకుని నిర్దేశిత ఫీజు చెల్లంచి ఈ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ఏకంగా 11 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 11,062 ఉద్యోగాలకు గాను 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అలాగే భాషా పండితులు 727, ఎస్జీటీలు 6,508, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ( స్పెషల్ ఎడ్యుకేషన్’ 796 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారు తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.