Rajya Sabha : తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాలకు మూడు నామినేషన్లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా రేణుకా చౌదరి రేపు ఎన్నిక ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకోనున్నారు. మరోవైపు రిటర్నింగ్ అధికారులు అనిల్ కుమార్ యాదవ్ కు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పటికే అందజేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
తాజాగా రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 15 రాష్ట్రాల నుంచి 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ నుంచి వావిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈసీ వీరు దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించింది. దీంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.