Jayalalitha Gold: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు కోర్టు తీర్పు వెలువరించింది. ఆ ఆభరణాలు తీసుకోవడానికి మార్చి 6,7 తేదీలను ఖరారు చేసింది. ఈ రెండు రోజుల్లో ఆభరణాలు తీసుకువెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలతో రావాలని బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొత్తం 27 కేజీల బంగారు, వజ్రాభరణాలతో పాటు 700 కేజీలకుపైనే వెండి కూడా ఉంది. బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించినట్లు న్యాయస్థానం తెలిపింది.
ఇది కూడా చూడండి: Maratha Reservation Bill: అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించింది. కోర్టు నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకునే సమయంలో ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో రావాలని ఆదేశించింది. నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అదే విధంగా తమిళనాడు ప్రభుత్వం ఈ కేసులో కర్ణాటకకు లిటిగేషన్ ఫీజుగా రూ.5 కోటర్లు చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చూడండి: Operation Valentine: ఏం జరిగినా సరే చూస్కుందాం.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్

