»Thats My Family Problem Says Brs Mla Muthireddy Yadagiri Reddy Reaction On Daughter Police Complaint
Jangaon అది మా కుటుంబ సమస్య: కుమార్తె ఫిర్యాదుపై జనగామ ఎమ్మెల్యే స్పందన
మ్మెల్యే రంగంలోకి దిగి జనగామలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కుమార్తె సంతకం ఫోర్జరీ చేయలేదని ఒక్కమాటతో సమాధానం ఇచ్చారు. చేర్యాలలోని స్థలం ఆమె పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని స్పష్టం చేశారు.
తన సంతకం ఫోర్జరీ చేసి స్థలం కబ్జా చేశారని తనపై కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనగామ (Jangaon) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (Muthireddy Yadagiri Reddy) స్పందించారు. కూతురు సంతకాన్ని కబ్జా (Land Occupation) చేశారనే ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఆమె స్థలం ఆమె పేరు మీదనే ఉందని స్పష్టం చేశారు. అయితే ఆ స్థలం అద్దెకు ఇవ్వడం వలన ఇలాంటి ఆరోపణలు వచ్చాయని వివరణ ఇచ్చారు. ఇది తనకు జరిగిన తప్పిదమని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎకరం 20 గుంటల భూమిని నా తండ్రి సంతకం ఫోర్జరీ (Forgery) చేసి తన పేరుపై మార్చుకున్నారని యాదగిరి రెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు జనగామ జిల్లాలో (Jangaon District) కలకలం రేపింది. వెంటనే ఎమ్మెల్యే రంగంలోకి దిగి జనగామలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నా కుమార్తె సంతకం ఫోర్జరీ చేయలేదని ఒక్కమాటతో సమాధానం ఇచ్చారు. చేర్యాలలోని స్థలం ఆమె పేరు మీదే రిజిస్టర్ చేసి ఉందని స్పష్టం చేశారు. అయితే ఆ స్థలం నా కుమారుడు కిరాయికి ఇచ్చారని, అది తనకు తెలియకుండా జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే నా బిడ్డ పొరపడి ఉంటుందని పేర్కొన్నారు.
‘ఇది కుటుంబ సమస్య (Family Problem). ఏ కుటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు సహజమే. నా కుమార్తెను (Daughter) ఉపయోగించుకుని ప్రత్యర్థులు తనపై ఉసిగొల్పుతున్నారు. రాజకీయంగా గిట్టనివారు ఈ వ్యవహారాన్ని వివాదంగా మార్చారు. ఒకవేళ నేను తప్పు చేస్తే ప్రజలు శిక్ష (Punish) వేస్తారు. మా సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటా. వివాదం సృష్టించే వారి విజ్ణతకే వదిలేస్తున్నా’ అని ఎమ్మెల్యే తెలిపారు. తనపై వరుస ఆరోపణలు వస్తుండడంతో ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడంపై మనస్తాపం చెందారు.