Rain Floods: తెలంగాణలో వర్ష (Rain) బీభత్సం కొనసాగుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కుంభవృష్టి కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగొపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోతున్నాయి. షార్ట్ కట్ దారుల్లో వెళ్లేవారు అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే.. చెరువులు, కుంటల తెగి వెళ్లే పరిస్థితి ఉండదు.
వేములవాడ నుంచి సిద్దిపేట వచ్చే దారిలో ఓ రొడ్డం తెగింది. రహదారిపై నీరు ప్రవహిస్తోంది. సో.. ఆ వైపు నుంచి వచ్చేవారు అలర్ట్గా ఉండాలి. ఇటు వరంగల్లో కూడా విస్తరంగా వర్షాలు కురుస్తాయి. చెరువులు, రోడ్డుపై ఉండే కాలువలు తెగి ప్రవహిస్తున్నాయి. అక్కడ కూడా అలర్ట్గా ఉండాలి అని.. దారిలో వెళ్లేవారు అడిగి మరీ వెళితే సేఫ్.
నిజామాబాద్ (nizamabad) జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. వేల్పూరులో అత్యధికంగా 46 సెంటిమీటర్ల వర్షం కురిసింది. 7,8 గంటల్లోనే ఈ స్థాయిలో వర్షం పడింది. వర్షపు నీటితో చెరువు కట్టలు, వాగులు తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడ పరిస్థితిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
జనకాం పేట చెరువు, బచ్చలనాయుడు చెరువు, తాడి, మన్సుకుంట చెరువు తెగాయి. రోడ్లు కూడా పాడయ్యాయని.. పునరుద్దరణ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. వెంకటపూర్ చెరువులోకి నీరు వచ్చే అవకాశం ఉందని.. అక్కడ ప్రొక్లెయినర్.. ఏర్పాటు చేశామని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ఆ నంబర్లకు కాల్ చేయాలని కోరారు. హన్మకొండకు చెందిన వారు 1800 425 1115, వరంగల్ 91542 52937, మహబూబాబాద్ 79950 74803, భూపాలపల్లి 90306 32608/ 1800 425 1123, ములుగు 1800 425 7109, జనగామ 63039 28718, వరంగల్ నగరపాలక సంస్థ 1800 425 1980 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.