»Personal Data Of 16 Crore People Across The Country Has Been Stolen
Cyberabad CP : దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ
దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ (Cyberabad) పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు (police) గుర్తించారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
దేశంలో కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ (Cyberabad) పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు (police) గుర్తించారు. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు బ్యాంకులు, సిమ్ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్ చేసిన వారి వ్యక్తిగత డేటాను మొత్తం చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైన క్రమంలో ఈ ముఠాను పోలీసులు (police) అరెస్టు చేశారు.
సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ (Cyberabad CP) స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra) తెలిపారు. నాగ్‌పూర్(Nagpur), ఢిల్లీతోపాటు ముంబైకి చెందిన ముఠాగా గుర్తించినట్లు చెప్పారు. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.‘ దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు (Cyber criminals) వ్యక్తిగత డేటాను అపహరిస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. కేటుగాళ్లు ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డులు,(Credit cards) లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు.
డేటా చోరీ గ్యాంగ్‌లకు (gangs of thieves) ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను (Personal data) విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశాం’ అని సీపీ వివరించారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను ఇప్పటికే చోరీ చేసినట్లు గుర్తించారు. ఆధార్, పాన్ కార్డు, (Pan card) బ్యాంకు డీటెయిల్స్ (Bank details) ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేశారని తెలుస్తోంది.