బేగంపేట (Begumpet) మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)పై జరిమాన విధించారు. ఓ కస్టమర్(Customer) నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజు రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల జరిమానా విధించింది.
బేగంపేట (Begumpet) మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)పై జరిమాన విధించారు. ఓ కస్టమర్(Customer) నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజు రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల జరిమానా విధించింది. (Officials of GHMC)ఇచ్చిన వివరాల ప్రకారం.. జే సురానా అనే వ్యక్తి.. ట్విటర్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు.
తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్స్ అండ్ రూల్స్(Apartments Acts and Rules),1987లోని 28, 24. జీవో168 ప్రకారం.. వినియోగదారుడు బిల్ చూపించినా కూడా పార్కింగ్ ఫీజు(Parking fee)ను వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసినా మైహోమ్ టైకూన్ మాల్.. సురానా నుంచి పార్కింగ్ రుసుము వసూలు చేసింది. దాంతో సురానా ట్విట్టర్ (Twitter)ద్వారా.. జీహెచ్ ఎంసీకి కంప్లైంట్ ఇచ్చింది. పార్కింగ్ ఫీజులను ప్రభుత్వం 2018లోనే నియంత్రించిన నేపథ్యంలో షాపింగ్ మాల్ సిబ్బంది వసూలు చేయడాన్ని సదరు వ్యక్తి తప్పుబట్టాడు.