• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

womens day Gift : మహిళలకు గుడ్ న్యూస్… మార్చి8న వడ్డీ లేని రుణాలు

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలకు ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు (Harish rao) గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి8న సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలను సంబందించి రూ 750 కోట్లు విడువదల చేస్తామని చెప్పారు. వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని హారిశ్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని హరీశ్‌రావు అన్నారు.

March 6, 2023 / 04:41 PM IST

preethi case నిందితులను రక్షించే ప్రయత్నం: బండి సంజయ్

Bandi sanjay on preethi case:మెడికో ప్రీతి (preethi) మృతి కేసు నిందితులను తెలంగాణ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. పథకం ప్రకారమే కేసీఆర్ (kcr government) ప్రభుత్వం ఈ కేసును (case) నీరుగారుస్తోందని తెలిపారు. సీఎంవో (cmo) నుంచి ఆదేశాల మేరకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

March 6, 2023 / 04:45 PM IST

gorantla buchi babuకు బెయిల్ మంజూరు..రూ.2 లక్షల పూచికత్తు, పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశం

gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.

March 6, 2023 / 04:10 PM IST

KTR : అదానీ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వం పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) మరోసారి ఫైర్ అయ్యారు. శ్రీలంకలో (Srilaka) అదానీ (Adhani) ప్రాజెక్టు పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఎ మిత్ర్‌ కాల్‌ (A Mitr Kaal)’ లో ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్‌ (ఒకే దేశం.. ఒకే మిత్రుడు)’ అనేది కొత్త పథకమని కేటీఆర్ అన్నారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టును ఆ దేశ ఆర్థిక మంత్రి ‘ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం’గా అభివర్ణించారు.

March 6, 2023 / 03:46 PM IST

Foxconn : సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ.. ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ (CM KCR) చేస్తున్న కృషి, ఆయ‌న విజ‌న్‌ త‌న‌కు ఎంతో ప్రేర‌ణ ఇచ్చింద‌ని ఫాక్స్‌కాన్ చైర్మెన్(Foxconn Chairman) యంగ్ లియూ(Young Liu) అన్నారు. కొంగరకలాన్ (Kongarakalan) లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రన్ని ఏర్పటు చేసేందుకు తాము కట్టబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామని చె...

March 6, 2023 / 03:04 PM IST

Dharani రద్దు చేస్తే ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారు: మంత్రి హరీశ్ రావు

రైతు పథకాలపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయని వివరించారు. ఇటీవల పంజాబ్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు పర్యటించడాన్ని ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో సోమవారం మంత్రి పర్యటించారు.

March 6, 2023 / 02:21 PM IST

kcr family ఆ దేవుడిని కూడా వదల్లేదు: Revanth reddy

Revanth reddy on kcr family:సీఎం కేసీఆర్ (cm kcr).. ఆయన కుటుంబం (family) ఆ దేవుడిని (god) కూడా వదల్లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్దిలో ముసుగులో మరొకరు దేవుడిని కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి (revanth reddy) సోమవారం చొప్పదండిలో (choppadandi) హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించారు.

March 6, 2023 / 02:13 PM IST

preethiది హత్యేనంటున్న తండ్రి నరేందర్.. డీజీపీతో భేటీ

preethi father narender:ప్రీతి (preethi) మృతిపై (dead) ఆమె తండ్రి నరేందర్ (preethi father narender) మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురిది ముమ్మాటికీ హత్యేనని తెలిపారు. ఈ రోజు ఆయన తెలంగాణ డీజీపీ కార్యాలయానికి (dgp office) వచ్చారు. అంజనీకుమార్‌ను (anjani kumar) కలిసి సమగ్ర విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు.

March 6, 2023 / 01:43 PM IST

Ugadi Festival 19 నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. ఆ సేవలు బంద్

ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు ముగుస్తుండడంతో కుటుంబసమేతంగా మల్లికార్జునుడి దర్శనానికి రానున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు పాలక మండలి ఆదేశాలు ఇచ్చింది.

March 6, 2023 / 01:03 PM IST

Komatireddy venkat reddy:శత్రువులను కూడా చెరదీస్తా, ఆడియో లీకుపై వెంకట్ రెడ్డి

Komatireddy venkat reddy reacts on audio leak: కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) ఆడియో (audio) ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ (cheruku sudhakar) కుమారుడు సుహాస్‌తో (suhas) మాట్లాడినట్టు ఆ ఆడియో (audio) ఉంది.

March 6, 2023 / 12:59 PM IST

Women’s Day: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్!

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం, మార్చి 5వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం రోజున సెలవు వర్తిస్తుంది.

March 6, 2023 / 12:21 PM IST

son in law agitation:వామ్మో.. ఏందిది? బంగారం పెట్టలేదని, కరెంట్ పోల్ ఎక్కేశాడుగా..

మెదక్ (medaK) జిల్లా గాంధీనగర్‌కు (gandhi nagar) చెందిన శేఖర్ (sheakar) వృత్తిరీత్యా ఎలక్ట్రిషీయన్.. ఇటీవల ఓ యువతిని ప్రేమించి పెళ్లి (love marriage) చేసుకున్నాడు. ఇరు వైపు కుటుంబ సభ్యులు గమ్మనకుండా ఉన్నారు. పైగా తనకు అత్తగారు బంగారం (gold) పెట్టాలని డిమాండ్ చేశాడు. చెబితే వినడం లేదు అనుకున్నాడో ఏమో కానీ.. కరెంట్ పోల్ (current pole) ఎక్కేశాడు.

March 6, 2023 / 12:05 PM IST

Ponguleti : ఏ పార్టీ మారినా నా ఎజెండా ఒకటే…

Ponguleti : తాను ఏ పార్టీ మారినా... తన ఎజెండా మాత్రం ఒకటేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన బీఆర్ఎస్ ని వీడాలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే... ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లాలి అనే విషయంలో ఆయనకు ఇంకా క్లారిటీ రాలేదు.

March 6, 2023 / 11:41 AM IST

Sania Mirza Farewell సానియాకు ఘన సత్కారం.. హాజరైన అతిథులు

స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ కోర్టు వీడింది. ఆమె తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలకడంతో హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అనంతరం నిర్వహించిన రెడ్ కార్పెట్ ఫంక్షన్ లో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ దంపతులు, దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, మాజీ క్రికెటర్ యు...

March 6, 2023 / 10:34 AM IST

Amitabh Bachchan injured:షూటింగ్‌‌లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్‌.. చీలిన పక్కటెముక

Amitabh Bachchan injured:ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని.. కుడి పక్కటెముక చీలిందని ఆయనే తెలిపారు. ప్రస్తుతం తాను ముంబైలో గల తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

March 6, 2023 / 11:17 AM IST