Telangana : తెలంగాణ రాష్ట్రంలో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకుంది. ఇటీవల ప్రీతి అనే మెడికల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరవకముందే.. మరో సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చోటుచేసుకుంది. ఇటీవల ప్రీతి అనే మెడికల్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన మరవకముందే.. మరో సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
నిజామాబాద్ లో సనత్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సనత్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదవుతున్నాడు. మృతుడు సనత్‌ది పెద్దపల్లి జిల్లా కాగా.. నిజామాబాద్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సనత్ 2020 బ్యాచ్‌కు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సనత్ ఆత్మహత్యపై విద్యార్థులు, కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సనత్ ఆత్మహత్యకు పాల్పడటంపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు నిజామాబాద్‌కు చేరుకుంటున్నారు.