»Minister Talasani Inspected The Site Of Fire Accident Swapnalok
Minister Talasani : అగ్నిప్రమాద స్వప్నలోక్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ (Swapnalok) అపార్ట్మెంట్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల (Firenjans) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు భవనంలో చిక్కుకుపోగా.. వారిని సిబ్బంది రక్షించారు. మరికొంత మంది భవనంలో చిక్కుకుపోయారు.వారిని సైతం కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ (Swapnalok) అపార్ట్మెంట్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్ల (Firenjans) సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పలువురు భవనంలో చిక్కుకుపోగా.. వారిని సిబ్బంది రక్షించారు. మరికొంత మంది భవనంలో చిక్కుకుపోయారు. వారిని సైతం కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయని, మరో అరగంటలో మంటలన్నీ రెస్క్యూ పూర్తవుతుందన్నారు. ప్రమాదంలో ఏడుగురిని అధికారులు రక్షించారని, మరికొందరు భవనంలో చిక్కుకుపోయారన్నారు. అయితే, లోపల ఎంత మంది ఉన్నది తెలియరాలేదని, వారంతా కేకలు వేస్తున్నారని తెలిపారు.
వారిని సైతం కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భవనంలో ఇనుప రాడ్స్ కారంగా భవనంలో వారంతా చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు అవసరమైన సామగ్రితో పాటు ఆక్సిజన్‌ను(Oxygen)సైతం భవనంలోకి పంపినట్లు మంత్రి తెలిపారు. భవనంలో ఉన్న వారికీ ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారని, దాంతో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. ఒకే ప్రాంతంలో మంటలు వస్తున్నాయని, కొద్దిసేపట్లో వాటిని సైతం అదుపులోకి తీసుకువస్తారన్నారు. అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ రాత్రి 7.45 గంటల సమయంలో ప్రమాదానికి సంబంధించి సమాచారం వచ్చిందని తెలిపారు. స్కై లిఫ్ట్‌తో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) చేస్తున్నామని, భవనం చుట్టుపక్కల ఫైర్ ఇంజిన్లను (Fire engines)మోహరించి మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కొందరు భవనం పైకి వెళ్లారని, మరికొందరు 5వ ఫ్లోర్‌కు వెళ్లారన్నారు. ఇప్పటి వరకు భవనం నుంచి ఏడుగురిని రక్షించినట్లు వివరించారు. ఐదవ ఫ్లోర్ వద్దకు స్కై లిఫ్ట్‌ను తీసుకెళ్లికి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు