»Minister Harish Rao Says That The Preachers Have Access To Medical Care
Filaria : బోధకాలు వ్యాధిగ్రస్తులకు అందుబాటులో వైద్యం : మంత్రి హరీశ్ రావు
ఫైలేరియా(Filaria) వ్యాధిగ్రస్తులను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు మంత్రి హారీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు.ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కేంద్రంలోని క్యాంపులో రూ.40 లక్షలతో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిట్స్ పంపిణీ(Distribution of free kits) ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.
ఫైలేరియా(Filaria) వ్యాధిగ్రస్తులను తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుండెల్లో పెట్టుకుని చూస్తున్నదని, వీరికి ఆసరా ఫించన్లు అందజేస్తున్నట్లు మంత్రి హారీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు.ఫైలేరియా(బోధకాలు) వ్యాధిగ్రస్తులకు అన్ని జిల్లా కేంద్రాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కేంద్రంలోని క్యాంపులో రూ.40 లక్షలతో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత కిట్స్ పంపిణీ(Distribution of free kits) ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైలేరియాతో బాధ పడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు . జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8 వేల 121 మందికి పైగా ఫైలేరియా బాధితులకు ఉచితంగా కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు 3 నెలలకు ఒకసారి మందులు అందిస్తున్నామని, వాటిని వాడుకోవాలన్నారు.
సిద్ధిపేటతో పాటు జిల్లాలోని అన్నిచోట్ల క్లినిక్ ఏర్పాటు చేసి బోధకాల వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేలా ఆరోగ్య శాఖ(Department of Health) అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీలో భాగంగా ఈసీఐఎల్ కంపనీ సహకారంతో లాప్రోస్కోపీ (Laparoscopy), వ్యాక్యుమ్ అందించిన అర్చన సురేష్, ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో 99.9శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు (Deliveries) జరుగుతున్నాయని, వాటిలో 66శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ప్రభుత్వ దవాఖానలో జరిగితే.. 33.9 శాతం ప్రైవేటులో జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్షన్లు ఎక్కువగా అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై (District Collector)వైద్యబృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.