ktr on bhatti:తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో (telangana budget session) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివిధ అంశాలపై వాడీ వేడిగా డిస్కషన్ జరగుతుంది. కొన్ని సందర్భాల్లో సభలో నవ్వులు కూడా పూయిస్తోంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు (bhatti vikramarka) మంత్రి కేటీఆర్ (minister ktr) ఇచ్చారు. ఆ కౌంటర్‌తో సభలో ఉన్న సభ్యులను ఒక్కసారిగా నవ్వించింది. మెట్రో రైల్పై (metro rail) సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రానికి మెట్రో రైల్‌ను తీసుకొచ్చిందే తామేనని వ్యాఖ్యానించారు. వైఎస్ పాలనలో (ysr rule) మెట్రో రైలు ప్రాజెక్టును (metro rail project) మొదలుపెట్టారని చెప్పారు. అప్పటికీ, ఇప్పటికీ రేట్లలో చాలా వ్యత్యాసం ఉందని.. ప్రకటనల్లో గుత్తాధిపత్యం కల్పించడం కరెక్ట్ కాదని భట్టి సూచించారు.
ఆ పాపం కాంగ్రెస్‌దే
భట్టి విక్రమార్క ప్రశ్నకు మంత్రి కేటీఆర్ (ktr) సమాధానం ఇచ్చారు. ప్రకటనల విషయంలో పాపం అంతా కాంగ్రెస్ పార్టీదేనని (congress) తేల్చిచెప్పారు. ఆ పార్టీ రూపొందించిన నిబంధనలనే ప్రస్తుతం తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. మెట్రో పిల్లర్లపై (metro pillar) ప్రకటనల (adds) విషయంలో తమ తప్పేమీలేదని చెప్పారు. తొమ్మిది నెలల తర్వాత రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ రోజు సభలో ప్రస్తావించారు. తొమ్మిది నెలల్లో (9 months) వచ్చేది పిల్లలే కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీని 55 ఏళ్లు (55 years) అధికారంలో కూర్చోబెడితే ఆ పార్టీ ప్రజలకు చేసిందేంటీ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

కేంద్రంపై విమర్శలు
ఇటు కేంద్ర ప్రభుత్వంపై (central government) మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ (hyderabad) మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని చెప్పారు. ప్రతిపాదనలు పంపినా స్పందించడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో (bjp ruled states) మెట్రోలకు నిధులు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ 20 లక్షల మంది (1.20 crore people) ఉన్న హైదరాబాద్‌కు (hyderabad) నిధులు (funds) ఇవ్వడానికి మాత్రం ధైర్యం చేయడం లేదన్నారు. శాసనసభలో (assembly) ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్ఎన్డీపీ, మెట్రో రైలు, చార్మినార్ ఫుట్ పాత్ అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఢిల్లీ మెట్రో అధికారులతో హైదరాబాద్ మెట్రో ఆడిటింగ్ చేయించామని ఈ సందర్భంగా తెలిపారు.

80 శాతం తెలంగాణ వారే
అమీర్‌పేట (ameerpet) మెట్రో స్టేషన్ ఎంత కిక్కిరిసిపోతుందో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ (minister ktr) అన్నారు. 80 శాతానికిపైగా తెలంగాణ పిల్లలే పని చేస్తున్నారని వెల్లడించారు. మెట్రో ధరలు (metro rates) ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోబోమని చెప్పారు. ఆర్టీసీతో (rtc) సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు (officials) సూచించామని వెల్లడించారు. రూ.6250 కోట్లతో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం (shamshabad airport) వరకు మెట్రోను మూడేండ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. హైదరాబాద్ అంటే చార్మినార్ (charminar) అని అందరికీ తెలుసు అని తెలిపారు. పాతబస్తీకి మెట్రో పనులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.
హైదరాబాద్ ఆత్మ చెదరిపోదు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్ని ఆధునాతన భవంతులు నిర్మించినా హైదరాబాద్ ఆత్మ (hyderabad soul) ఎప్పటికీ చెదిరిపోదన్నారు. గుల్జార్‌హౌస్, మీర్-ఆలం-మండి, ఆషుర్ ఖానాకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. మదీనా నుంచి పత్తర్‌గట్టి వరకు పనులు పూర్తికావొచ్చాయని వివరించారు. పాతబస్తీలో సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామని తెలిపారు. చార్మినార్ నుంచి దార్-ఉల్-ఉలం స్కూల్ వరకు రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. హుస్సేనీ ఆలం నుంచి దూద్‌బౌలి వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. హెరిటేజ్ భవంతుల పూర్వవైభవం కోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
నాలాల అభివృద్ది
హైదరాబాద్‌లో రూ.985.45 కోట్లతో నాలాల (naala) అభివృద్ధి చేపట్టామని మంత్రి కేటీఆర్ (ktr) అన్నారు. జీహెచ్ఎంసీ (ghmc) పరిధిలో 35 పనులకు 11 పూర్తిచేశామని వివరించారు. పరిసర మున్సిపాలిటీల్లో 21 పనులకు 2 పూర్తిచేశామని సభకు వివరించారు. నగరంలో వంద ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాలపై 28 వేల మంది పేదలు ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. స్ట్రటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ) దేశంలో ఏ నగరంలోనూ లేదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎస్ఎన్డీపీ ఫేజ్-2కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తొలిదశలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కొన్ని పూర్తికావడంతో ఎల్బీనగర్లోని కొన్ని కాలనీల్లో గత వర్షాకాలంలో ముంపు సమస్య కొంతమేర తగ్గిందని స్పష్టం చేశారు.

