చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందరూ లైక్ చేస్తుంటారు. పీసెస్ జ్యూసీగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటారు. లేడీస్ కూడా అంతే.. ధర తక్కువగా ఉండటం మరో కారణం. శ్రావణ, కార్తీక మాసాలు.. ఏదైనా ఫ్లూ వచ్చిన సమయంలో ధర ఆమాంతం పడిపోతుంది. చలి, వర్షకాలంలో ధర ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఉండటంతో తప్పదు.. మరీ కిలో చికెన్ రూ.99కే లభిస్తే.. జనం ఎగబడతారు.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో గల భారత్ చికెన్ సెంటర్ వద్ద బంపర్ ఆఫర్ పెట్టారు. ఇక్కడ కేజీ చికెన్ రూ.99కే విక్రయిస్తున్నారు. ఇంకేముంది జనం బారులు తీరారు. తక్కువ ధరకే దొరకడంతో పెద్ద క్యూ ఉంది. తనకు కోళ్ల ఫారాలు ఉన్నాయని.. అందుకోసం ఇలా తక్కువ విక్రయిస్తున్నానని ఓనర్ ముజ్జు తెలిపారు. ఇతర కారణం ఏమీ లేదని చెప్పారు. రెండురోజుల పాటు ఇదే రేటు ఉంటుందన్నారు. ఆఫర్‌తో జనం బాగానే ఉన్నారు. కిలోల కొద్దీ తీసుకొని వెళుతున్నారు. మరికొందరు పచ్చడి పెట్టుకొని, నిల్వ ఉంచుకుంటామని చెబుతున్నారు. ఇతర రోజుల్లో ఆ పచ్చడి ఆరగించొచ్చు అని సెలవిస్తున్నారు.
ఆఫర్‌ను ముజ్జు రెండురోజులే పెట్టాడు.. కంటిన్యూ చేస్తే అతనికి లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రెగ్యులర్‌గా రానీ వారికి చికెన్ అలవాటు చేసినట్టు ఉంటుంది. తన బిజినెస్ ఐడియాను చక్కగా ఆప్లై చేశాడు. మరీ అదీ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలీ.