పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
KCR CAR: పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ 420, ఒక్కొక్క దాని మీద 30 శాతం కమీషన్లు, ధరణి పోర్టల్ స్కాం, జియో 111 స్కాం, బొగ్గు కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణం, కాళేశ్వరం స్కాం అంటూ కాంగ్రెస్ పార్టీ గులాబీ రంగు కారుతో వ్యంగ్య ప్రచార రథం తయారు చేయించింది. అయితే ఈ కారును గాంధీభవన్లో నాంపల్లి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు.
ఈ కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు రాయడంతో ఆదివారం రాత్రి నాంపల్లి పోలీసులు కారును సీజ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన టీ కాంగ్రెస్ తన ట్విటర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ 420 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారంతో కల్వకుంట్ల కుటుంబం అహం దెబ్బతింది. పోలీసులు తమ విధులను అప్రజాస్వామికంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఘటనను తమ పార్టీ ఖండిస్తుంది అంటూ రాసుకొచ్చారు.