KCR: సూర్యపేట నుంచి రెండో రోజు ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర

లోక్ సభ ఎన్నికల వేళా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు సూర్యపేట నుంచి ఆయన రెండోరోజు ప్రారంభం అయింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడాతున్నారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 06:22 PM IST

KCR: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రోజు సూర్యపేట నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం భువనగిరి జిల్లాలో రోడ్డు షోతో పాటు పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ మార్గమధ్యంలో అర్వపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోని ప్రజలు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్‌కు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ క్యామ మల్లేష్‌కు మద్దతుగా రోడ్డు షో నిర్వహిస్తున్నారు.

చదవండి:Kavitha : బీఆర్‌ఎస్‌ నేత కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తి.. మే 6న నిర్ణయం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 24 నుంచి మిర్యాలగూడలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సిద్దిపేటలో ముగుస్తుంది. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్డు షోలు ప్లాన్ చేశారు. ఈ యాత్రలో రైతులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలపై ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ రోడ్డు షో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి:CRPF DSP : ప్రమాదవశాత్తూ గన్‌ పేలి సీఆర్‌పీఎఫ్‌ డీఎస్‌పీ మృతి

Related News

Kishan Reddy: కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.