»Hyderabad Is Ready For International Formula Race
International Formula Race : ఫార్ములా రేస్‌కు హైదరాబాద్ సిద్ధం
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి.
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి. ప్రధాన రేసు శనివారం (Saturday) ఉండగా ,శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ 1 రేస్ ను నిర్వహిస్తున్నారు. 2.8 కిలోమీటర్లు ట్రాక్ (Trank) మొత్తంలో 18 మలుపులు తో రేసులో 11 జట్లు ( Team) పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా 22 వేల మంది కూర్చుని రేసును తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ట్రాక్ చుట్టూ ఎల్ఈడీ (Led) స్క్రీన్లు పెట్టారు. ప్రేక్షకుల కోసం 16 గ్యాలరీలు ఉండగా, చిన్నారుల కోసం పీపుల్స్ ప్లాజాలో ఫ్యాన్ విలేజ్ వేదికను సిద్ధం చేశారు.
దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు హాజరయ్యే ఈ రేస్‌పై పోలీసులు (Police) డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేసింగ్ అనుభూతిని పొందేలా ట్రాక్ చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేసి, డ్రైవింగ్ చేస్తున్న కార్లను ప్రత్యక్షంగా చూసేలా గ్యాలరీలను నిర్మించారు. రేసింగ్ ట్రాక్‌ను ఒకవైపు నుంచి మరో వైపుకు దాటేందుకు 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను తాత్కాలిక ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. ఇందులో ఎన్టీఆర్ గార్డెన్ ( Ntr garden) ఎదురుగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జీ మొదటి నుంచి శాశ్వత ప్రాతిపదికన ఉండగా, మరో మూడింటిని ఎన్టీఆర్ ఘాట్ వెనక వైపు, మింట్ కాంపౌండ్, ఐమ్యాక్స్ ( Imax) ఎదురుగా ఏర్పాటు చేశారు. దీంతో ఫార్ములా -ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నా ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు అందుబాటులో ఉన్నాయి. ప్రేక్షకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రేక్షకుల గ్యాలరీల వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. రేసింగ్‌లో పాల్గొనే డ్రైవర్లందరూ, వారి కార్ల కోసం ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ (Hmda )స్థలంలో కస్టమైజ్డ్ గ్యారేజీలను అత్యాధునిక శైలిలో నిర్మించారు.
అంతర్జాతీయ ఆటో స్పోర్ట్స్ గేమ్‌గా ప్రసిద్ధించిన ఫార్ములా-ఈ పోటీలు వీక్షించేందుకు 2.8 కి.మీ పొడువునా ట్రాక్ చుట్టూ 16 చోట్ల ప్రేక్షకుల గ్యాలరీలను ఏర్పాటు చేయగా, సుమారు 22వేల మంది కూర్చునేలా సీట్లను, ఇతర మౌలిక వసతులను కల్పించారు. ఇందులో 6 రకాలుగా టికెట్ రేట్లను నిర్ణయించారు. రూ.1000, రూ.4,000, రూ.7,000, రూ.10,500, రూ.65,000లు రూ.1,25,000 వేలుగా నిర్ణయించారు. గురువారం నాటికి వెయ్యి, రూ.4వేలు,రూ.10,500 టికెట్లు అమ్ముడుపోగా, మిగతావి బుక్‌మై షో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. రూట్ మ్యాప్ ద్వారా ట్రాక్ చుట్టూ ఎక్కడ ఏ గ్యాలరీ ఉందో అర్థమయ్యేలా వెబ్సైట్లో పొందుపర్చారు. నగరం నుంచి వివిధ మార్గాల నుంచి వచ్చే వారికి పలు చోట్ల నుంచి ఎంట్రీ గేట్లను ఏర్పాటు చేశారు. మీడియా గ్యాలరీని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో గ్రీన్ లాంజ్ పేరుతో వీఐపీల (Vip) కోసం ఏర్పాటు చేయగా, వీవీఐపీల కోసం ఏస్ లాంజ్‌ను రేస్ ముగింపు పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు.