Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి హార్ట్ ఎటాక్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించారు.
Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మాదాపూర్లోని మెడికోవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొండల్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ శరత్ రెడ్డి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొండల్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ్ముడి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది నిమిషాల్లో మెడికోవర్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి పోటీ చేయబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సీఎం రేవంత్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు ఎవరూ లోక్సభ స్థానానికి పోటీ చేయడం లేదు. పార్లమెంటు అభ్యర్థుల విషయంలో అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది. నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో తమ్ముడికి మద్దతు ఇస్తే సులువుగా గెలిచే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా భావించారు. అయితే తనకు టిక్కెట్ ఇస్తే పెద్దఎత్తున విమర్శలు వస్తాయని రేవంత్ తమ్ముడ్ని ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయనకు గుండెపోటు రావడం పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది.