తెలంగాణ (Telangana) రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతునే ఉంది. 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఫాక్స్ కాన్ సంస్థ ప్రకటించింది. గతంలో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్ కాన్ (Fox Conn) సిద్ధంగా ఉందన్నారు. ఫాక్స్ కాన్ గ్రూపుతో తమ స్నేహం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని కేటీఆర్( KTR )తన ట్వీట్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫాక్స్ కాన్. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తమకు ఉన్న దృఢమైన బంధానికి నిదర్శమని మంత్రి ట్వీట్ చేశారు. ఇరువురి మధ్య పరస్పర అవగాహన కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు. తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శమని ఆయన తెలిపారు. ఫాక్స్‌కాన్ పెట్టుబడి ద్వారా 25వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని గతంలో కేటీఆర్ వెల్లడించారు. ప్రతిపాదిత ప్లాంట్ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కార్యకలాపాల తెలంగాణలోని కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేయడంతో పాటు సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి వీలు కల్పిస్తుందని ఫాక్స్‌కాన్ పేర్కొంది. ఈ కంపెనీ(Company) పెట్టుబడి ద్వారా వేల మందికి ఉపాధి కల్పి చున్నది