KMM: దూరాజ్పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు.